బీఆర్ఎస్ ఫ్లెక్సీలో అల్లు అర్జున్ ఫోటో..!

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోటో ఉండటం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హనమకొండ జిల్లాలో ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఒకవైపు.. అల్లు అర్జున్ ఇంకోవైపు ఉన్న ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అందులో తగ్గేదేలే . కేసీఆర్ అంటే ఓ బ్రాండ్ అనే క్యాప్షన్ తో ఏర్పాటైన ఆ ప్లేక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.