గిన్నీస్ వరల్డ్ రికార్డు అందుకున్న మెగాస్టార్..ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్లేస్ దక్కించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్లేస్ దక్కించుకున్నారు. 156 సినిమాలు..537 పాటలు,24 వేల స్టెప్పులతో అలరించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు చిరంజీవి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్,గిన్నిస్ బుక్ ప్రతినిధులు.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదే అందుకున్న విషయం తెలిసిందే. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరటంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిరంజీవి. వీటికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చింది. అంతకుమందు సినీరంగాని ఆయన చేసిన సేవలకు గాను కేంద్రప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషన్ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోనూ చోటు దక్కించుకున్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సీనీ కెరీర్ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు,అవమానాలు ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగారు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరి స్ఫూర్తిగా నిలిచారు. డాన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆరు పదుల వయసులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు, అవార్డులు దక్కించుకున్నారు చిరంజీవి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



