మెగా మూవీలో వెంకటేష్
పల్లవి, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెగా 157’. ఈ సినిమాలో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ క్యామియో ఉంటుందని వెంకటేశ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఈ మెగా కాంబోలో వెంకటేష్ కేవలం క్యామియో కాదని.. దాదాపు గంటసేపు ఆ పాత్ర ఉంటుందని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.పైగా, చిరు-వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఫిల్మ్ నగర్ లో తెగ ప్రచారం మొదలైంది.
ఆ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని కూడా సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై మెగా అభిమానులు హైఓల్టేజీ ఎక్స్ ప్టేషన్స్ తో ఉన్నారు.



