మెగా అభిమానులకు గుడ్ న్యూస్..!
పల్లవి, వెబ్ డెస్క్ : సీనియర్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి , హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా అనిల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా నయనతార, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు క్యాథరిన్, వీజీపీ గణేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ , ముస్సోరిలో రెండో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ నయనతార పాల్గొన్నారు. వీరిద్దరిపై ఓ పాటను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ ఆగస్టు తొలివారంలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇందుకు సంబంధించి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియో లో నెట్ వర్క్ జరుగుతుంది అని టీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని టాక్.ఈ చిత్రాన్ని సుష్మిత కొణిదెల సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మెగా అనిల్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న మూవీ వచ్చే సంక్రాంతికి విడుదలవ్వనున్నది.



