పవర్ స్టార్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరు స్పందిస్తూ ” చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా , ప్రజాజీవితంలో జనసేనానిగా , ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నిండునూరెళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలందరికీ మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ ” అని వారిద్దరి అరుదైన ఫోటోను మెగాస్టార్ ట్వీట్ చేశారు.