‘మెగా 157 ‘ మూవీకి అదిరిపోయే టైటిల్ ..?

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరో , మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ‘ మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఖరారైనట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తోన్నాయి.
అయితే, దీనిపై మూవీ యూనిట్ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీలో స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార , సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.