సినీ కార్మికులతో త్వరలోనే భేటీ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : తాను ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక సినీ కార్మికులతో భేటీ అవుతానని తెలంగాణ రాష్ట్ర సినిమా, ఫోటోగ్రఫీ ,రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘ హైదరాబాద్ లో సినీ కార్మికులు బతకాలంటే వారికిస్తూ జీతాలు పెరగాల్సిందే. వారికి కుటుంబం , పిల్లలు ఉంటారు కదా ‘ అని అన్నారు.
తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు సైతం తమ వినతి పత్రాలను అందజేశారు. అయినా అట్నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సినీ కార్మికులు వర్కులను ఆపేసి మరి సమ్మెకు దిగారు. వారంలో సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే తాను రంగంలోకి దిగుతానని మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం తాను కార్మికుల పక్షాన నిలబడతాము. ప్రభుత్వం తరపున ఆదుకుంటాము. నిర్మాతల మండలి సైతం కార్మికుల విన్నపాలను అంగీకరించాలని ఆయన కోరారు. ఢిల్లీ పర్యటన తర్వాత నిర్మాతలతో, సినీ పెద్దలతో, కార్మికులతో వేర్వేరుగా సమావేశమవుతాను. ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.



