Bigg Boss 8 Telugu : నాగ మణికంఠ పెళ్లి వీడియో ఇదిగో .. ఆయన భార్య ఈమెనే!
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెడితే అందులో ఎక్కువగా నాగ మణికంఠ బాగా పాపులర్ అయ్యాడు.
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెడితే అందులో ఎక్కువగా నాగ మణికంఠ బాగా పాపులర్ అయ్యాడు. ఎంట్రీ వీడియోలో తన కష్టాలను చెప్పుకుని సింపథీని వర్కౌట్ చేశాడు. పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోయాడని.. తల్లి ఇంకొకర్ని పెళ్లిచేసుకుందని.. ఆ తర్వాత తల్లి క్యాన్సర్ తో చనిపోయిందని చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకుని యూఎస్ కు వెళ్తే.. కూతురు పుట్టిన తరువాత యూఎస్ నుంచి తన భార్య వెళ్లగొట్టిందంటూ ప్రోమోలో చెప్పుకొచ్చాడు. హౌస్‌లోకి వెళ్లిన తరువాత మాత్రం మాట మార్చేశాడు నాగమణికంఠ. తన భార్య బంగారమని.. తాను బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చానంటే అందుకు తన భార్య కారణమని.. ఆమే తనకి షాపింగ్‌కి డబ్బులు కూడా పంపి వెళ్లంటూ ప్రోత్సహించిందని తెలిపాడు. ఈ క్రమంలో నాగమణికంఠ భార్య గురించి నెటిజన్లు వెతకడం స్టార్ట్ చేశారు. నాగ మణికంఠ భార్య పేరు ప్రియ. ఈమెకు సంబంధించి నాగ మణికంఠ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు కానీ ఏమీ లేవు.. కానీ హీరో శివాజీ బిగ్ బాస్ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్‌లలో మణికంఠ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. ఇందులో ప్రియను చూడోచ్చు. నాగమణికంఠ జోడీ ఎలా ఉందో మీరే చూసేయండి.
View this post on Instagram



