Bigg Boss 8 Telugu : పడ్డ ఫస్ట్ వికెట్ .. బేబక్క ఎలిమినేట్!
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెడితే అందులో మొదటి ఎలిమినేటర్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెడితే అందులో మొదటి ఎలిమినేటర్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది.ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద లీక్స్ వచ్చేశాయి. విష్ణు ప్రియా, శేఖర్ బాషా, ఆకుల సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి శెట్టి వంటి వాళ్ళు నామినేషన్ లో ఉంటే సోనియా సేఫ్ అయినట్లుగా నిన్ననే హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
ఇక మణికంఠను హౌస్ లోని వాళ్లంతా టార్గెట్ చేయడంతో సింపతి వర్కౌట్ అయి అతను టాప్ ప్లేస్ లోకి వచ్చేసాడు. ఇక ఇక మిగతా వాళ్లలో చూసుకుంటే బెజవాడ బేబక్క ఈ వారం, ఫస్ట్ ఎలిమినేటర్ అని తెలుస్తోంది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లలో బేబక్క కి తక్కువ ఓట్లు రావడంతో ఆమెని నాగార్జున ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా కిచెన్ కే పరిమితం కావడం, టాస్కుల్లో పెర్ఫామ్ చేయలేకపోవడం, వంటల్లో కండిషన్స్ పెట్టడం బేబక్క ఎలిమినేషన్ కు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీక్ చివరికి వచ్చేసరికి బేబక్క యాక్టివ్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బేబక్క ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో 13 మంది సభ్యులు ఉంటారు.
Related News
-
Bigg Boss 8 Telugu : తొక్కలో షో : మారని బిగ్ బాస్.. రోటిన్ ఎలిమినేషన్!
-
Bigg Boss 8 Telugu : బేబక్క ఔట్.. వారంలో ఆమె సంపాదించింది ఎంత?
-
Bigg Boss 8 Telugu : నాగ మణికంఠ పెళ్లి వీడియో ఇదిగో .. ఆయన భార్య ఈమెనే!
-
Bigg Boss 8 Telugu: దిమాక్ ఉండాలే.. వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. అసలు ఎం జరిగింది?
-
నాగార్జున గారూ ఈ మణికంఠను ఎలిమినేట్ చేయండి సార్… భరించలేకపోతున్నమ్
-
అన్నయ్యను ఎవరూ గెంటేయలేదు.. ఆయనవన్నీ సొంత నిర్ణయాలే : నాగమణికంఠ సిస్టర్ పోస్ట్



