Bigg Boss 8 Telugu : తొక్కలో షో : మారని బిగ్ బాస్.. రోటిన్ ఎలిమినేషన్!
Bigg Boss 8 Telugu : అవును.. బిగ్ బాస్ ఏం మారలేదు.. మళ్లీ రోటిన్ ఎలిమినేషనే కంటిన్యూ చేశాడు. అందరూ ఊహించినట్టే బిగ్ బాస్ ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది.
Bigg Boss 8 Telugu : అవును.. బిగ్ బాస్ ఏం మారలేదు.. మళ్లీ రోటిన్ ఎలిమినేషనే కంటిన్యూ చేశాడు. అందరూ ఊహించినట్టే బిగ్ బాస్ ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ 8 సీజన్ లో ఏడో కంటెస్టెంట్గా హౌజ్లోకి అడుగు పెట్టిన బెజవాడ బేబక్క ఫస్ట్ ఎలిమినేట్ అయింది. ఓ ఏజ్డ్ గ్రూప్ వాళ్లను బిగ్ బాస్ సహించట్లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలిమినేషన్ లో బిగ్ బాస్ పాత సంప్రాదాయాన్నే కంటిన్యూ చేశాడు. కంటెస్టెంట్లలో ఎవరైతే కాస్త ఏజ్డ్ గా ఎవరు కనిపిస్తున్నారో వారిని తొలి వారంలోని ఎలిమినేట్ చేస్తున్నాడు.
బాస్ హిస్టరీని తిరగేస్తే
ఒకసారి బిగ్ బాస్ హిస్టరీని తిరగేస్తే ఫస్ట్ సీజన్లో సింగర్ కల్పన.. మూడో సీజన్లో నటి హేమ.. నాలుగో సీజన్ కరాటే కళ్యాణి.. ఐదో సీజన్లో కార్తీకదీపం ఉమాదేవి.. వీళ్లంతా తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఇదే లెక్కన బేబక్కను కూడా ఎలిమినేట్ చేశారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో ఈ ఏజ్డ్ గ్రూప్ ఆడవాళ్లకు బిగ్ బాస్ షోలో అన్యాయం జరుగుతుందని చర్చ తెరపైకి వచ్చింది. అటు సోషల్ మీడియాలో కూడా బేబక్క అభిమానులు కూడా ఇదేంషో… తొక్కలోది.. టార్గెటెడ్ ఎలిమినేషన్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
బేబక్క సంపాదన ఎంతంటే ?
బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన బెజవాడ బేబక్క ఈ వారం రోజల్లో ఎంత సంపాదించింది అన్నది హాట్ టాపిక్ గా మారింది. బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. సోషల్ మీడియాలో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. ఆమెకు1.64 కే ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ లోకి వచ్చాక బేబక్కకు 1.83కే ఫాలోవర్స్ పెరిగారు. బేబక్క పర్ డే రెమ్యునరేషన్ రోజుకు రూ. 21 వేల 428 అని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూస్తే ఆమె ఉన్న వారం రోజులకు బేబక్క సంపాదించింది సుమారుగా రూ. 1.50 లక్షలు. ఆమె ఇంకొన్ని రోజులుంటే బాగానే సంపాదించేది.బేబక్క ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో 13 మంది సభ్యులు ఉంటారు.



