Bigg Boss 8 Telugu: దిమాక్ ఉండాలే.. వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. అసలు ఎం జరిగింది?
బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ ఘట్టం ముగిశాక కాటెస్టెంట్స్ మూడు టీమ్ లుగా విడిపోయి టాస్కులు అడవుతున్నారు. అప్పటివరకు నామినేషన్స్ తో గొడవలు పడ్డ కంటెస్టెంట్స్ ఇప్పుడు టాస్కులతో గొడవలు పెట్టుకుంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ ఘట్టం ముగిశాక కాటెస్టెంట్స్ మూడు టీమ్ లుగా విడిపోయి టాస్కులు అడవుతున్నారు. అప్పటివరకు నామినేషన్స్ తో గొడవలు పడ్డ కంటెస్టెంట్స్ ఇప్పుడు టాస్కులతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సీజన్ కి మొదటి టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో చీఫ్స్ గా ఉన్న నిఖిల్, యాష్మి, నైనిక తమ తమ టీమ్స్ ను సెలెక్ట్ చేసుకొని టాస్కుల్లోకి దిగారు. అయితే.. తసుకులు మొదలుపెట్టడం బాగానే మొదలుపెట్టినా.. మధ్యలో ఎవరికీ ఇష్టం వచ్చినట్టుగా వారు రూల్స్ మార్చేసి.. పక్కవారి టాస్కును డిస్టర్బ్ చేస్తూ.. ఆడేశారు.
అలా టాస్కులు ముగిసిన తరువాత.. కిచెన్ దగ్గర సీత, అభయ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ముందుగా సీత.. మీ గిన్నెలు మీరే కడుక్కోండి అని అన్నారు. దానికి.. అభయ్ స్పందిస్తూ అది గేమ్ అంటూ సీరియస్ అయ్యాడు. దాంతో.. రెచ్చిపోయిన సీత మీరు పనిచెయ్యరా.. మీ గిన్నెలు మేమెందుకు కడగాలి అంటూ ఫైర్ అయ్యింది. అలా గొడవ కాస్త పెద్దగా అవడంతో.. మధ్యలో అభయ్ అడిగాడానికి ముందు దిమాక్ ఉండాలి. చెప్పేది వినాలి కదా ముందు.. అని అనేశాడు.
దానికి.. ఎమోషనల్ అయినా సీత నాకు అన్నం వద్దు అంటూ ఏడ్చుకుంటూ అక్కడినుండి వేల్లిపూయింది. దిమాక్ ఉండాలి అనే మాటలు ఏంటి.. అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. రాత్రి పడుకునేటప్పుడు కూడా.. వాళ్ళ గిన్నెలు తోముకుంటూ ఉంటే మేము ఎప్పుడు గేమ్ ఆడతాము. మా టీమ్ గెలిచేది ఎప్పుడు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. అయితే.. ఈ విషయంపై ఆడియన్స్ కూడా కాస్త నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ అంత సీన్ లేకపోయినా కావాలని కంటెస్టెంట్స్ ఓవర్ చేస్తున్నారు అని. చూస్తుంటే అవి వాళ్ళ జెన్యూన్ ఫీలింగ్స్ లా లేవని అంటున్నారు. ఇక మొదటివారానికి గాను.. వోటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. వాటిలో.. బెబక్క చివరి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆవిడే మొదటివారం ఎలిమినేట్ అవుతారా? లేక బిగ్ బాస్ ఏమైనా మ్యాజిక్ చేస్తారా అనేది చూడాలి.



