బన్నీ బాలీవుడ్ ఎంట్రీ.. బన్సాలితో ఫిక్స్?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు రూ.1800 కోట్లకు పైగా వసూల్లు సాధించి ఇండియన్ సినిమాలో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు రూ.1800 కోట్లకు పైగా వసూల్లు సాధించి ఇండియన్ సినిమాలో టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇదిలా ఉంటే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్‌తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మైథలాజికల్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జేట్‌తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని నిర్మాత నాగ వంశీ చెప్పి మరింత హైప్ పెంచేశాడు. తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే బన్నీ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీను అల్లు అర్జున్ ముంబై వెళ్లి కలిశాడట. దీంతో ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.