షాకింగ్ అప్డేట్.. త్రివిక్రమ్ కాదు మారుతీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. త్వరలోనే బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేయనుంది ఈ మూవీ.
అయితే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలోనే ఆయన దర్శకుడు మారుతితో సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో రాజాసాబ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2025 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరువాత బన్నీ సినిమాను మొదలుపెట్టనున్నాడట మారుతీ. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక వచ్చే వరకు ఆగాల్సిందే.