ప్రభాస్ అభిమానులకు శుభవార్త..!

పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ రాజాసాబ్’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. ఇందులో ముందుగా ప్రకటించిన విధంగా డిసెంబర్ ఐదో తారీఖున పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి చిత్రం మేకర్స్ సన్నహాలు చేస్తుంది.
దీంతో సినిమా విడుదల వాయిదా పడనున్నది అని వస్తున్న వార్తలపై చిత్రం మేకర్స్ క్లారిటీచ్చినట్లు అయింది. ఈ వార్తలతో ప్రభాస్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.రాజాసాబ్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పుట్టిన రోజు నాడు ఆయన లుక్ ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను పంచుకున్నారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ‘రాజాసాబ్’ మేకర్స్ ఆయన లుక్ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.