నింగిని అంటిన పసిడి ధర..!

పల్లవి, వెబ్ డెస్క్ : బంగారం ధర రోజు రోజు పరుగులు తీస్తూనే ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇవాళ మంగళవారం బంగారం ధర తులంపై ఏకంగా రూ.820 ఎక్కువైంది.కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగింది.
ఈరోజు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ. 1,02,220 వద్ద ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.93,700 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,700కు చేరింది. కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగి రూ.1,15,000 వద్ద ట్రేడవుతోంది.