మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!

పల్లవి, వెబ్ డెస్క్ : మొబైల్ యూజర్లకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ఫ్లాన్ల ధరలను మళ్లీ పెంచేందుకు అన్ని టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పోయిన ఏడాదినే భారీగా పెంచిన ఆయా కంపెనీలు తాజా పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈసారీ ఏకంగా ప్రస్తుతం ఉన్న ధరలకు పది నుంచి పన్నెండు శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ కంపెనీలకు యూజర్లు పెరగడం, 5G ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ ధరల పెంపు ఉండోచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బేస్ ఫ్లాన్ల జోలికి వెళ్లకుండా , మిడిల్ , టాప్ ఫ్లాన్ల ధరలు పెంచుతారని, కొన్ని ఫ్లాన్లలో కోత విధిస్తారనే మార్కెట్ విశ్లేషకుల టాక్.