గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్..!

పల్లవి, వెబ్ డెస్క్ : గోల్డ్ లవర్స్ ఇది నిజంగా బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూసే. రోజురోజుకి బంగారం ధరలు నింగిని అంటుతున్నాయి. బంగారం ప్రేమికులకు షాకిస్తూ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. నేటి మార్కెట్ ట్రెండింగ్ ప్రకారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఏకంగా రూ .1,640లు పెరిగింది.
ఒక్కరోజే పదహరు వందలకు పైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురయ్యారు. మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే ప్రయాణించడం మరో విశేషం. హైదరాబాద్ మార్కెట్ ట్రెండింగ్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ .1,04,950 లతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.
అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ.1500లు పెరిగి రూ.96,000ల వద్ద నిలిచింది. అటు ఏపీలోని విజయవాడ, వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిపై ఒక్కరోజే రూ.1,100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,31,000కు చేరింది.