నేటి నుంచి ‘కొత్త రూల్’

పల్లవి, వెబ్ డెస్క్ : ఈ రోజు మంగళవారం నుంచి ఇండియన్ రైల్వే లో సరికొత్త రూల్ ను అమలు కానున్నది. రైలు తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఈరోజు మంగళవారం నుంచి ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఆధార్ ఆథంటికేషన్ ను తప్పనిసరి చేసిన రైల్వే శాఖ తాజాగా ఓటీపీ కూడా తప్పనిసరి చేసింది. దీంతో ఈరోజు నుంచి పీఆర్ఎస్ కౌంటర్లు , ఐఆర్టీసీ వెబ్ సైట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబరు కు వచ్చే ఓటీపీని తప్పకుండా ఎంటర్ చేయాలి. కాగా ఉదయం పది గంటలకు ఏసీ, పదకొండు గంటలకు స్లీపర్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.