తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

పల్లవి, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
మొత్తం పంతొమ్మిది కేజీల సిలిండర్ ధరను రూ.58.50 పైసలు మేర తగ్గిస్తున్నట్లు సదరు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,665లకు చేరింది.
తగ్గించిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి రానున్నాయి. అటు గృహోపయోగ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.