JioBharat 4G Diwali Offer : రిలయన్స్ జియో బంపరాఫర్.. రూ. 699కే 4జీ ఫోన్లు
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో బంపరాఫర్ తో ముందుకు వచ్చింది. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ కింద జియో భారత్ 4జీ ఫోన్ల ధరలను తగ్గించింది
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో బంపరాఫర్ తో ముందుకు వచ్చింది. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ కింద జియో భారత్ 4జీ ఫోన్ల ధరలను తగ్గించింది. ఇప్పటి వరకు ఈ ఆఫర్లు రూ. 999గా ఉండగా.. ఆఫర్ లో రూ. 699కే కొనుగోలు చేయొచ్చని జియో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం పరిమితకాలం మాత్రమే ఉంటుందని జియో వెల్లడించింది. దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్లు, డిజిటల్ ఫీచర్లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇతర కంపెనీల నెలవారీ రీఛార్జి ప్లాన్లతో (రూ.199) పోలిస్తే జియో భారత్ ఫీచర్ ఫోన్ ప్లాన్లు చౌకగా లభిస్తాయని జియో తెలిపింది. ఈ ఫోన్లతో నెలకు 40శాతం మేర అంటే నెలకు రూ.76 చొప్పున ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జియో సిమ్‌కార్డుతో మాత్రమే పనిచేసే ఈ ఫోన్లను దగ్గర్లోని రిలయన్స్ స్టోర్‌లో గానీ, జియోమార్ట్ లేదా అమెజాన్ వెబ్సైట్లో గానీ కొనుగోలు చేయొచ్చని తెలిపింది.
కేవలం రూ. 123 నెలవారీ ప్లాన్‌తో, JioBharat వినియోగదారులు ఆనందించవచ్చు
అపరిమిత వాయిస్ కాల్స్
నెలకు 14 GB డేటా
455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు
సినిమా ప్రీమియర్లు మరియు తాజా సినిమాలు
వీడియో ప్రదర్శనలు
ప్రత్యక్ష క్రీడలు
జియోసినిమాలోని ముఖ్యాంశాలు
QR కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ చెల్లింపులు చేయండి మరియు స్వీకరించండి
JioPay ద్వారా అందుకున్న చెల్లింపుల సౌండ్ అలర్ట్‌లను స్వీకరించండి
గ్రూప్ చాట్లను అనుభవించండి
JioChatలో వీడియోలు, ఫోటోలు మరియు సందేశాలు మరియు మరిన్నింటిని భాగస్వామ్యం చేయండి



