తగ్గిన బంగారం ధరలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ. 490లు తగ్గింది.
దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,020లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.450 లు తగ్గింది.
దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.87,100ల వద్ద కొనసాగుతోంది. అయితే, కిలో వెండి పై రూ.1000లు తగ్గి కిలో వెండి రూ.1,08,000లుగా ఉంది.