డీపీఎస్ లో పర్యావరణ దినోత్సవం

పల్లవి, హైదరాబాద్: మహేంద్ర హిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్విజ్లు, స్లోగన్ రైటింగ్స్, పోస్టర్ మేకింగ్స్ చేశారు. ఈ కార్యక్రమానికి డీపీఎస్, పల్లవి గ్రూప్ చైర్మన్ మల్క కొమురయ్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ వ్యవస్థలు, సహజ వనరులు, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ నందితా సుంకర మాట్లాడుతూ.. భూ గ్రహంపై గల విలువైన వనరులను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చైర్మన్ మల్క కొమురయ్య, ప్రిన్సిపాల్, టీచర్లతో కలిసి క్యాంపస్ లో మొక్కలు నాటారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు వారం పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

