కళానిధి మారన్ కుటుంబంలో విబేధాలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ వ్యాపార వేత్త, నిర్మాత, సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ కుటుంబంలో విబేధాలు వెలుగులోకి వచ్చాయి. కళానిధి మారన్ కు ఆయనతో పాటు మరో ఏడుగురికి, ఆయన సోదరుడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు.
2023లో వాటాదారులను సంప్రదించకుండా అరవై శాతం కంపెనీ షేర్లను కళానిధి అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. వీటి ద్వారా ఇప్పటివరకూ అర్జించిన మొత్తాన్ని తనకు , ఇతర వారసులకు తిరిగి ఇవ్వాలి. కంపెనీ షేర్ హోల్డింగ్స్ ను 2003 నాటి పోషిషన్ కు రీసోర్టు చేయాలని డిమాండ్ చేశారు.