స్త్రీ సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన “స్వస్తినారి – సశక్తు పరివార అభియాస్” కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం, కుటుంబ సదృఢత, సశక్తీకరణ పై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజం బలంగా నిలవాలంటే మహిళలు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, అందుకోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.
తరువాత ఆసుపత్రి వసతులను పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ గారు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న నూతన భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించి, వాటి పురోగతి గురించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.జిల్లా సమస్యల పరిష్కారంలో తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కలెక్టర్‌కు ఎంపీ గారు స్పష్టం చేశారు.కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.