రాత్రిపూట ఏవైపు తిరిగి నిద్రపోవాలి…!

పల్లవి, వెబ్ డెస్క్ : రాత్రిపూట నిద్రపోయే సమయంలో కొంతమంది ఎడమవైపు తిరిగి నిద్రపోతారు. మరికొంత మంది కుడివైపు తిరిగి నిద్రపోతారు. ఇంకొంతమంది నిటారుగా ఆకాశాన్ని చూస్తూ నిద్రపోతారు.
మరి ఏవైపు తిరిగి నిద్రపోతే మంచిదో తెలుసా..?. రోజుకి ఎన్ని గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదే తెలుసా..?. తెలియదా , అయితే ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి. పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎడమవైపు తిరిగి నిద్రపోతే గుండె ఆరోగ్యానికి మేలు . గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది. వీపు , నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గి చక్కగా నిద్రపడుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన సమస్యగా భావించే గురక సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.