నిఫా వైరస్ లక్షణాలు ఇవే..?

పల్లవి, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలలోనే ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మరణించారు. అప్రమత్తమైన అధికారులు ఆరు జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేశారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లోని ప్రజలు అవసరమైతేనే ఆసుపత్రులకు వెళ్లాలని మినిస్టర్ జార్జ్ సూచించారు.
ఇప్పటివరకు 546 మంది కాంటాక్ట్లను గుర్తించామని, 46 అనుమానిత కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే నిఫా వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నిఫా వైరస్ గబ్బిలాలు, జంతువుల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది.
అంతేకాదు రక్తం, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా ఇతరులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన 9 రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు, దగ్గు, అతిసారం తదితర లక్షణాలు కన్పిస్తాయి. నిఫా వైరస్ మెదడుపై ప్రభావం చూపుతుంది.