వార్ 2 ట్రైలర్ – బ్యాలెన్స్ చేసిన డైరెక్టర్..!
పల్లవి, వెబ్ డెస్క్ : 2019లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వార్ . సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా యశ్ రాజ్ ఫిల్మ్ స్పై బ్యానర్ పై ఆదిత్య చోప్తా నిర్మించారు. దీనిని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.. రూ.170కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 450కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం వార్ -2 . బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ , అందాల రాక్షసి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆగస్టు పద్నాలుగు తారీఖున విడుదల కానున్నది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఓ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తే ఆ సినిమా ట్రైలర్, టీజర్ కటింగ్ కత్తిమీద సాము లాంటిది. ఒక హీరోను ఎక్కువగా చూపిస్తే ఇంకొ హీరోను తక్కువ చేసినట్లుగా ఆ హీరో అభిమానులు భావించి రచ్చరచ్చ చేస్తారు. అంతేకాదు ఆ సినిమాపై అంచనాలు కూడా మొదట్లోనే తగ్గుతాయి. అందుకే ఏ దర్శకుడైన ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఏ సినిమాను తీసిన ఇద్దరికి సమ న్యాయం చేస్తారు. వార్ -2 మూవీ ట్రైలర్ ను చూస్తే దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కు సమన్యాయం చేశారని అన్పిస్తుందని సినీ విమర్శకులు విశ్లేషిస్తున్నారు.
వార్ -2 ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ కాంటెంపరరీగా ఉంది. టెక్నికల్ గా మేకింగ్ శబాష్ అన్పించాయి. దాదాపు రెండున్నర నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈక్వెల్ గా కన్పించారు. మధ్యలో హీరోయిన్ కియారా అద్వానీ స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. యాక్షన్ సీన్లకు తగ్గట్లుగా బీజీఎం ఉండటంతో ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ లో ముందు హృతిక్ రోషన్ కన్పించిన కానీ హీరోలిద్దరికీ దర్శకుడు ట్రైలర్ కటింగ్ సమంగా చేశారన్పిస్తుంది.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన సమయంలో హృతిక్ రోషన్ కు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వడంతో అప్పట్లో నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ వివాదం తర్వాత విడుదల చేసిన మరో టీజర్ లో ఎన్టీఆర్ ను హైలెట్ చేయడంతో ఫ్యాన్స్ కూలయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో ఆ లోటు కన్పించలేదు ఎక్కడ. తాజా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.



