అతి నిద్రతో ఆరోగ్యానికి ముప్పు…!

పల్లవి, వెబ్ డెస్క్ : బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా రోజువారీ కనీసం నిద్రపోవడానికి సమయం ఉండదు కొంతమందికి. కానీ మరికొంత మంది రోజూ నిద్రపోవాల్సిన సమయం కంటే ఎక్కువగా నిద్రపోతారు. అయితే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి కూడా ముప్పే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజు నిద్ర పోవాల్సిన ‘9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వెన్ను నొప్పి, తల నొప్పితోపాటు డిప్రెషన్కు కూడా గురవుతారు. రాత్రి పూట ఎక్కువగా భోజనం చేయకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవచ్చు’ అని వైద్యనిపుణులు చెబుతున్నారు.