రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ఓ అగంతకుడు కాల్ చేసి ఈరోజు సోమవారం సాయంత్రంలోపు లేపేస్తాము. దమ్ముంటే కాపాడుకో అంటూ ఎంపీని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ లో పర్యటిస్తున్న ఎంపీ రఘునందన్ రావుకు 912143352974 నుంచి కాల్ చేసి పీపుల్స్ వార్ మావోల పేరుతో ఈవెనింగ్ లోపు చంపేస్తాము.
దమ్ముంటే కాపాడుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ఫోన్ ను రఘునందన్ పీఏ ఎత్తాడు. దీనిపై తెలంగాణ డీజీపీ జితేందర్, మెదక్ ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అగంతకుడుపై కేసు నమోదు చేసి విచారించాలని ఎంపీ రఘునందన్ కోరారు.