రేవంత్ రెడ్డి గొంతులో ‘హరిహర వీరమల్లు’ ముల్లు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గొంతులో హరిహర వీరమల్లు ముల్లు దిగింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ లో జరిగిన ఆత్మగౌరవ గర్జన సభకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కల్సి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ పుష్ప -2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ప్రమాదం తర్వాత నిండు సభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను ఉన్నంత వరకు సినిమా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తి లేదని ‘ అన్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచారని రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దేశపతి శ్రీనివాస్ ఇంకా మాట్లాడుతూ’ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే టికెట్ల రేట్లు పెంచారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కాబట్టే రేవంత్ రెడ్డి పవన్ సినిమా టికెట్ల రేట్లు పెంచారు. హరిహర వీరమల్లు మూవీ ముల్లు రేవంత్ రెడ్డి గొంతులో దిగింది. అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి తెలంగాణలో మళ్లీ టీడీపీని తీసుకు రావడానికి కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు, మోదీ ఏమి చేప్పిన చేస్తాడు. వాళ్లిద్దరూ ఆడమన్నట్లు రేవంత్ రెడ్డి ఆడతాడు. తెలంగాణలో టీడీపీ లేకుండా కేసీఆర్ చేస్తే, కేసీఆర్ ను లేకుండా చేయాలని వీళ్లు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు.
తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టును వద్దే వద్దు అని బీరాలు పలికిండు. చంద్రబాబు నాయుడు ఏమి ఎక్కువ చేస్తున్నావు. బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డు తగులుతున్నావు అని వార్నింగ్ ఇవ్వడంతోనే తెల్లారే ఢిల్లీకి వెళ్లి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలో పాల్గొన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు కు అటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ప్రతినెల సంచులు పంపుతాడు. సంచులు పంపుతాడు. రాష్ట్రాన్ని సంకనాకిస్తాడు . ఆరు గ్యారంటీలకు మంగళం పాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హమీని నెరవేర్చరు. హమీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లపై ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఐదు వేల కేసులు పెట్టారు. ఉమ్మడి పాలనలో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మారిస్తే పదేండ్లలో కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి సాగునీరు అందించి వలసల వాపస్ పాలమూరు జిల్లాగా కేసీఆర్ మార్చిండు. కేసీఆర్ ఏమో పాలమూరుకు అన్యాయం చేసిండంట. చంద్రబాబు నాయుడేమో పాలమూరుకు న్యాయం చేస్తాడంట. ఇలా ఉంది రేవంత్ రెడ్డి తీరు అని దేశపతి శ్రీనివాస్ అన్నారు.



