సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ సృజనాత్మక శక్తి తో నూతన ఆవిష్కరణలు చేసే
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు అని మంత్రి కొనియాడారు.
విశ్వ కర్మ జన్మదినం సందర్భంగా సమాజ హితం కోరుతూ నిర్వహిస్తున్న యజ్ఞ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విశ్వ కర్మ కార్పొరేషన్ కోసం క్యాబినేట్ మంత్రిగా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచి విద్య తోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని ప్రజా ప్రభుత్వం అందుకు కృషి చేస్తోందని అన్నారు.
నిరుపేద విశ్వకర్మ కుటుంబాలకు చెందిన మెడిసిన్,ఫార్మా,ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థులకు బాసటగా ఉంటానని, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న వారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సాయం అందిస్తామని భరోసా కల్పించారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిజమైన అర్హులను గుర్తించి వారి వివరాలు తనకు అందజేయాలని విశ్వ కర్మ కమిటీ సభ్యులకు మంత్రి సూచించారు.
Related News
-
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నరసింహారెడ్డి
-
తీన్మార్ మల్లన్న సరికొత్త పార్టీ ..
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్