బీసీలకు ప్రధాన శత్రువు రేవంత్ రెడ్డి- తీన్మార్ మల్లన్న

పల్లవి, వెబ్ డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ లో హరిత హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడతూ’ రాష్ట్రంలో బీసీ ప్రజలకు ప్రధాన శత్రువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని’ ఆయన ప్రకటించారు.తెలంగాణ లోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ,రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో బిసి జె.ఏసి పొటి చేస్తుందని ఆయన అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక రైలు, విమానాల డిల్లీ కి వెళ్లి బిసి ప్రజలను మళ్ళీ మోసం చేశారనీ, బీసీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో పాలాభిశేకాలు చేసిన బ్యాచ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మన ఆత్మ గౌరవ కోసం, మన వాట కోసం,మన అధికార కోసం మనమంతా ఏకమై పోరాటం చేయాలిని ఈ సందర్భంగా అన్నారు
2028 లో బిసి ప్రభుత్వం ఎర్పాడటం తథ్యం అని బీసీల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చే బాధ్యత నాదిని మల్లన్న మాటిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ ,బిసి పొలిటికల్ జె.ఏ సి సమన్వయకర్తలు వట్టె జానయ్య యాదవ్ , బందారపు నర్సయ్య ,బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర నాయకులు రజనీ కుమార్ యాదవ్ ,హన్మకొండ జిల్లా నాయకులు బీసీ నాయకులు రమణ్ పటేల్ ,వర్ధన్నపేట నియోజకవర్గ బీసీ నాయకులు ఆకుల మనోజ్,భూపాలపల్లి జిల్లా జేఏసీ నాయకులురవి పటేల్ ,ములుగు జిల్లా నాయకులు కిషన్ ముదిరాజ్ , తిరుమని నాగరాజు తదితర జిల్లా బీసీ నాయకులు పాల్గొన్నారు