ఆర్ అండ్ బి శాఖ కు మంచి పేరు తీసుకురావాలి – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల ఎన్నికైన ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మంత్రుల నివాస సముదాయంలోనీ తన క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ…పూర్తి పారదర్శకతో ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాలు శాఖలో ప్రమోషన్స్ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి ఆర్ అండ్ బి శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సర్వీస్ రూల్స్ అప్రూవల్ చేసుకొని రెగ్యులర్ ప్రమోషన్స్ వచ్చేలా కృషి చేశానన్నారు. తనను కలిసి వినతులు ఇచ్చినప్పుడు మీకు తప్పకుండా శాఖ పరమైన ప్రమోషన్స్ వచ్చేలా చేస్తానని చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 118 మంది AEE లు డి.ఈ లుగా ప్రమోషన్స్ పొందారని,అట్లాగే 72మంది డి.ఈ లు ఈ.ఈ లుగా, 29మంది ఈ.ఈ లు ఎస్. ఈ లు,ఎస్.ఈ లు సి.ఈ లుగా 6గురు,సి.ఈ నుండి ఈఎన్సి గా ఇద్దరు ప్రమోషన్స్ పొందారని గుర్తు చేశారు.
శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చి మీరు అడిగినవన్ని చేస్తున్నది,మరింత ఉత్సాహంతో పని చేస్తారనే నమ్మకంతోనే అని మంత్రి స్పష్టం చేశారు. మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ శాఖ బలోపేతం పై దృష్టి పెట్టి అదే స్థాయిలో పని చేసేందుకు కృషి చేయాలని,శాఖ పరమైన ఆమోదయోగ్యమైన సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర కేడర్లలో మిగిలిన పదోన్నతులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.ప్రజల్లో ఆర్ అండ్ బి శాఖ కు మంచి పేరు తీసుకువచ్చే బాధ్యత శాఖ ఇంజనీర్ల పైనే ఉందని..ఆ గురుతర బాధ్యతను గుర్తెరిగి ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని మంత్రి వారికి హితబోధ చేశారు.”మీరు ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయిన తర్వాతనే మా సమస్యలు పరిష్కారమై,రెగ్యులర్ ప్రమోషన్స్ వచ్చాయని” మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి అసోసియేషన్ తరుపున తమ అభిమానాన్ని,కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
మంత్రిని కలసిన వారిలో ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్.శ్రీను,జనరల్ సెక్రటరీ బి.రాంబాబు,ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. శరత్ చంద్ర, ట్రెజరర్ మహేందర్ కుమార్,వైస్ ప్రెసిడెంట్లు కె.సంధ్య,వేణు,ప్రదీప్ రెడ్డి,జాయింట్ సెక్రెటరీలు నవీన్,కిషన్, అరుణ్ రెడ్డి పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు ఉన్నారు.