భారీగా పెరిగిన ఓజీ టికెట్ల రేట్లు

పల్లవి, వెబ్ డెస్క్: : ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “ఓజీ” టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ. 1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్ లో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది.
మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ తో పాటు ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అరున్ దాస్, హిమ్రాన్ హస్మీ తదితరులు నటిస్తున్నారు.