మద్యం షాపుల లైసెన్స్ ల జారీకి నోటిఫికేషన్ విడుదల

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మద్యం షాపుల లైసెన్స్ కు దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
తాజాగా విడుదలైన లైసెన్స్ ల గడవు ఈఏడాది 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం,ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 6 శ్లాబ్‌లలో లైసెన్స్‌లను ఎక్సైజ్ శాఖ జారీ చేయనున్నది.