ఫలించిన ఎంపీ గడ్డం వంశీ కృషి- మంచిర్యాల ప్రజలకు శుభవార్త..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గత ఒక సంవత్సరం నుంచి రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ , సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే బోర్డు చైర్మన్లను పలుమార్లు కలసి మంచిర్యాల్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు ఆగడానికి అనుమతి మంజూరు చేయాలని వినతులు అందజేశారు.
ఈ పట్టుదలతో చేసిన అనుసరణల ఫలితంగానే ఈ రోజు మంచిర్యాల్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరింది.పరిశ్రమల అభివృద్ధిలో వేగంగా ఎదుగుతున్న మంచిర్యాల్, భవిష్యత్ వృద్ధికి కీలక కేంద్రంగా నిలుస్తోంది.వందే భారత్ ఆగడానికి అనుమతి లభించడం వల్ల స్థానిక ప్రజలకు, విద్యార్థులకు, కార్మిక వర్గాలకు, పరిశ్రమలకు ప్రయాణ సౌలభ్యం పెరగనుంది.
ప్రజల అవసరాలను కేంద్రానికి వినిపించి విజయవంతం చేసిన ఎంపీ వంశీకృష్ణ గారికి మంచిర్యాల్ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.ఈ ఆగింపు మన జిల్లాకు అభివృద్ధి దిశగా మరో బలమైన అడుగుగా నిలుస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఆశయాలను సాధించడంలో ఎంపీ గారి కృషి చరిత్రలో నిలిచిపోతుందని అందరూ అభిప్రాయపడ్డారు.



