బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండిసంజయ్ ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హజరైన సంగతి తెలిసిందే. సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పదవులను అడ్డుపెట్టుకుని కేటీఆర్ చేయని నీచమైన పని లేదు. భార్యభర్తల ఫోన్లను ట్యాప్ చేసి మరి కాల్స్ వినడానికి సిగ్గు లేదా.. అఖరికీ తన సొంత చెల్లె కల్వకుంట్ల కవిత, బావ తన్నీరు హరీశ్ రావు ల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” సినీ రాజకీయ సెలబ్రేటీల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో తగాదాలు పెట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి తన పరువుకు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేశారు.
హైకోర్టు జడ్జిలు, ప్రస్తుత సీఎం, మాజీ సీఎం కేసీఆర్ కూతురు, అల్లుడు సహా వేలాది మంది ఫోన్లను మాజీ మంత్రి కేటీఆర్ ట్యాప్ చేయించారంటూ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆరోపించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోయినా, మళ్లీ ఆరోపణలు చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.