50కోట్ల మార్కు దాటిన కింగ్ డమ్

పల్లవి, వెబ్ డెస్క్ : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్డమ్. గత కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి.
ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాతగా వ్యవహరించగా మ్యూజిక్ సంచలనం అనిరుద్ సంగీతం అందించాడు. హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. జూలై ముప్పై ఒకటో తారీకున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.53కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్రం మేకర్స్ ప్రకటించారు. ఇవాళ రేపు వీకెండ్ కావడంతో ఈ రెండ్రోజుల్లో కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.