కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన
Kalvakuntla Kavitha

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కవిత మాట్లాడుతూ కేసీఆర్ నాడు పార్టీ పెట్టే ముందు వందల మందితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు.
తాను కూడా అదే మార్గంలో వందల మంది మేధావులతో, రాజకీయ విశ్లేషకులతో పాటు తెలంగాణ శ్రేయస్సు కోరుకునే వారితో సంప్రదింపులు జరుపుతున్నాను. ఆ తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తాను. అయితే కాంగ్రెస్ లో తాను చేరే ప్రసక్తి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.