భారతీయుడు -3 …తెరపైకి సూపర్ స్టార్ రజనీకాంత్

పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.1996 లో తమిళ సినిమా ఇండియన్ సినిమాకు అనువాద మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు హీరోయిన్ గా మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ – 2 మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ గా నిలించింది. ఇందులో శృతిహసన్, సిద్ధార్థ్ లాంటి నటులు సైతం నటించారు. అయినా కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
దీంతో ఈ సినిమాపై భారీగా ఖర్చు చేసిన నిర్మాతలు నష్టపోయారు. పెట్టిన పైసలు తిరిగిరాక మినిమమ్ కలెక్షన్స్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు నిర్మాతలు. ఇండియన్ -2 సినిమాతో లాస్ కావడంతో పార్ట్ – 3 మేము నిర్మించలేమని చేతులెత్తేశారు. పార్ట్ -3 మూవీ ఇప్పటికే ఎనబై శాతం పూర్తయింది. మిగతా భాగం పూర్తి చేయాలంటే తనకు ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఇవ్వాలని దర్శకుడు శంకర్ డిమాండ్ చేస్తుండని లైకా ప్రోడక్షన్ ప్రధాన ఆరోపణ. ఎనిమిది కోట్ల రెమ్యూనేషన్ ఇవ్వలేము. ఫ్రీగా అది తీయాలని లైకా ప్రోడక్షన్స్ నిర్మాతలు తేల్చి చెప్పడంతో సినిమా ఆగిపోయింది.
ఇండియన్ -2 మూవీని తెరకెక్కించింది లైకా ప్రోడక్షన్స్ కావడం, ఆ సంస్థతో సంప్రదింపులకు సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటు దర్శకుడు శంకర్ తో తనకు సత్సంబంధాలు ఉండటంతో ఈ వివాదానికి ముగింపు పలకడానికి సూపర్ స్టార్ సంప్రదింపులు చేస్తున్నారు. ఇటీవల తాను డైరెక్ట్ చేసిన గేమ్ ఛేంజర్ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో శంకర్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. అలాంటి శంకర్ ను సైతం ఎలాగైనా రజనీ ఒప్పిస్తాడు.. అందుకే ఎప్పుడు ఏ వివాదంలోకి తలదూర్చని, ఎలాంటి కాంట్రవర్సీలకు గురికాని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు శంకర్ తో మాట్లాడారు. హీరో కమల్ హాసన్ ను కలిశారు. తాజా పరిస్థితులను ఆయన వివరించారు. ఈ కారణంగా ఈ వివాదానికి త్వరలోనే ఫుల్ స్టార్ పడుతుంది . . తమ అభిమాన నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు- 3 షూటింగ్ సెట్టింగ్ లో ట్రాక్ పైకి వస్తుంది. మిగిలిన ఆ భాగాన్ని తీసి అనుకున్న టైం కు విడుదలవుతుందని హీరో కమల్ హాసన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.