జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, అరెస్టులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ –“రైతులు యూరియా కోసం పగలు-రాత్రులు లైన్లలో నిలబడి అవమానాలు భరించాల్సి వస్తోంది.
పీఏసీల వద్ద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతుల వేదనను వెలుగులోకి తెచ్చిన టి న్యూస్ రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేయడం, అదికూడా ప్రభుత్వం పై కుట్రలు గవర్నర్లను రాష్టప్రతులను దూషించి వారిపై యుద్దానికి వెళ్ళి నట్టు రకరకాల నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం ఇది ప్రజాస్వామ్యంపై దాడి. ఇది క్షమించరాని చర్య.ప్రభుత్వం వెంటనే ఈ కేసును రద్దు చేయకపోతే జర్నలిస్టులపై దాడులు తగలడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మేము ఎటువంటి ఉద్యమానికైనా వెనకడుగు వేయం.
భవిష్యత్తులో ప్రభుత్వం వణికేలా, అలజడి రేపేలా అఖిలపక్ష పిలుపుతో తీవ్ర ఉద్యమాలు తప్పవు” అని హెచ్చరించారు.“సాంబశివరావుపై పెట్టిన కేసును వెంటనే రద్దు చేయాలి. లేకపోతే జర్నలిస్టు సంఘాలు చేపట్టే పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇది కేవలం ఒక రిపోర్టర్ సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్య స్వేచ్ఛకు సంబంధించిన పోరాటం” అని పగడాల నాగరాజు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుండి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, న్యూ డెమోక్రసీ మాస్ లైన్ పార్టీ రంగన్న, సిపిఐ భాగం హేమంతరావు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, పౌరసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు