సోదరుడికి రాఖీ ఎలా కట్టాలి..?

పల్లవి, వెబ్ డెస్క్ : శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగ తర్వాత అప్పుడే దేశ వ్యాప్తంగా రాఖీ సంబురాలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టేందుకు సోదరుడిని ఏవైపు కూర్చోబెట్టాలి. సోదరి ఏ వైపు కూర్చుని తన సోదరుడికి రాఖీ కట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ కట్టేందుకు సోదరుడ్ని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలని హిందూ జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే రాఖీ కట్టడం మంచిదని ఆ శాస్త్రం సూచిస్తోంది.
రంగుల వారీగా మేష రాశి ఎరుపు, వృషభం నీలం, మిథునం , కన్య ఆకుపచ్చ, కర్కాటక తెలుపు, సింహా ఆరెంజ్. తులా తెలుపు లేదా లైట్ బ్లూ, వృశ్చిక ఎరుపు, ధనుస్సు పసుపు, మకరం నీలం , కుంభం నీలం లేదా పసుపు , మీనం పసుపు లేదా గోల్డ్ కలర్ రాఖీలు కడితే మంచిదని జ్యోతిష శాస్త్రం తెలిపింది.