రాఖీ ఎన్ని ముళ్లు వేయాలంటే..!

పల్లవి, వెబ్ డెస్క్ : నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగ తర్వాత దేశ వ్యాప్తంగా రాఖీ సంబురాలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టేందుకు సోదరుడ్ని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలని హిందూ జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే రాఖీ కట్టడం మంచిదని కూడా ఆ శాస్త్రం సూచిస్తోంది.
అయితే రంగుల వారీగా మేష రాశి ఎరుపు, వృషభం నీలం, మిథునం , కన్య ఆకుపచ్చ, కర్కాటక తెలుపు, సింహా ఆరెంజ్. తులా తెలుపు లేదా లైట్ బ్లూ, వృశ్చిక ఎరుపు, ధనుస్సు పసుపు, మకరం నీలం , కుంభం నీలం లేదా పసుపు , మీనం పసుపు లేదా గోల్డ్ కలర్ రాఖీలు కడితే మంచిదని జ్యోతిష శాస్త్రం తెలిపింది. ఆడబిడ్డలు తమ సోదరులకు రాఖీ కట్టేటప్పుడు ఇన్నే ముళ్లు వేయాలని జ్యోతిష శాస్త్రం చెబుతుంది..
రాఖీ కట్టేటప్పుడు తప్పనిసరిగా మూడు ముళ్లు వేయాలని వేదపండితులు చెబుతున్నారు. అది బ్రహ్మ విష్ణు, మహేశ్వరులకు ప్రతీక అని పండితులు అంటున్నార. మొదటి ముడి సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, శ్రేయస్సును, రెండో ముడి సోదరసోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ , నమ్మకం , గౌరవాన్ని , మూడో ముడి సోదరుడు జీవితంలో ఎల్లప్పుడూ సన్మార్గంలోనే నడవాలని సూచిస్తుందని పండితులు అంటున్నారు.