వర్షకాలంలో వేపాకుతో “ఆ సమస్యలకు” గుడ్ బై..!

పల్లవి, వెబ్ డెస్క్ : వేపాకు ఆకులు , కాయలు, బెరడు , కలప తో సహా మొత్తం ఔషధ గుణాలు కలగలిసిన ప్రకృతి యావత్ జనవానికి ప్రసాదించిన అద్భుత వరం. ఊర్లలో ప్రతి రోజూ ఉదయం లేవగానే వేపాకు పుల్లతోనే పళ్లు తోముకుంటారు. వేపపుల్లతో దంతాలను తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవ్వడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేప చెట్టు ఆకులు చర్మ సమస్యల నివారణలో ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. అనేక ఆయుర్వేద ఔషధాల్లో సైతం వేపాకును ఉపయోగిస్తారు. ఇటు ఆయుర్వేద ఔషధాల్లోనే కాదు బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వీటిని వాడతారు.
అంతటి గొప్పతనం ఉన్న వేపాకు వలన వర్షాకాలంలో వాడితే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వేపాకు మధుమేహం సంబంధిత సమస్యల పరిష్కరానికి ఎంతోగానో పని చేస్తాయి. వేపలో ఉండే ఫ్లేవనాయిడ్స్ , టెర్పెనాయిడ్స్ రక్తంలో చక్కెర లెవల్స్ ను నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి. వేపలో ఉండే శుద్ధి చేసే గుణాలు రక్తాన్ని శ్రభ్రపరుస్తాయి. క్రమం తప్పకుండా వేపాకులను తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు గోళ్లు, మొటిమలు మొదలైన అన్ని రకాల సమస్యలను నివారిస్తుంది.
అంతేకాదు వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్పెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. వేపాకు తీసుకోవడం కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వేపాకులతో దాని బెరడును రుబ్బి శరీరంలో ఏ ప్రదేశంలోనైనా కురుపులు లేదా మొటిమల సమస్యలుంటే ఉంటే ఆ ప్రదేశాల్లో రాయాలి. రాసిన కొద్దిరోజుల్లో ఆ సమస్య తొలగిపోతుంది.
వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కాలానుగుణ జబ్బులను నివారిస్తుంది. జ్వరం , వైరల్ ఫీవర్ లాంటి సమస్యలకు వేపాకు చెక్ పెడుతుంది. వేపాకులు యూరినరీ ట్రాక్ట్ ఇన్పెక్షన్ లో కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. వేపాకులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడమే కాకుండా దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాస కోశ సమస్యలను సైతం దూరం చేస్తుంది.