బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు

పల్లవి, వెబ్ డెస్క్ : బంగారం ధరలు మళ్లీ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ ఒక్కరోజే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.880లు పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,970కు చేరింది.
కాగా గత తొమ్మిది రోజుల్లో రూ.5,460లు పెరగడం విశేషం. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.800లు ఎగబాకింది. ఈ తాజా పెరుగుదలతో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.98,050లు పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రూ.900లు పెరిగి రూ.1,37,000 లు ఉంది.