పల్లవి మోడల్ స్కూల్ లో “స్వాతంత్ర సమరయోధుల” ఇంటర్ హౌస్

పల్లవి, వెబ్ డెస్క్ : బోయిన్ పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు అనే అంశంపై ఇంటర్ హౌస్ ఏకపాత్రాభినయం పోటీలను ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రముఖులు తెలియజేశారు.
ఈ పోటీలలో విద్యార్థినీ విద్యార్థులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రుద్రమదేవి, సుభాష్ చంద్రబోస్, సరోజినీ నాయుడు వంటి స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను ప్రదర్శించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ పోటీల్లో మోక్షిత్ కృష్ణా విభాగం నుండి ప్రథమ స్థానాన్ని పొందగా, సునందన్ గోదావరి విభాగం నుండి మరియు S. K నందన్ కృష్ణా విభాగం నుండి ద్వితీయ స్థానాన్ని సాధించారు.