రైతులతో మాజీ మంత్రి హరీశ్ టెలికాన్ఫరెన్స్

పల్లవి, వెబ్ డెస్క్ : అయిల్ ఫామ్ సాగు లో అంతర్ పంట వేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. ఇటీవల అశ్వరావు పేట కు వెల్లి అయిల్ ఫామ్ సాగు లో అంతర్ పంట సాగు అయిన కోకో వక్క పంటలను సందర్శించిన రైతులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.. అయిల్ ఫామ్ సాగు చేయడం ఎంతో మేలు జరిగిందని మీరు అయిల్ ఫామ్ సాగు చేసి నాల్గు సంవత్సరాలు గడిచిందని వాటి ఫలితాలు కండ్ల ముందు చూడటం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ ని 28% ఉంటే దాన్ని 18% కి తగ్గించింది దీని బీజేపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు..మీకు అయిల్ ఫామ్ సాగు లో ఎంతో అనుభవం ఉందని మీరు ఎంతో మంది రైతులకు స్ఫూర్తి, ఆదర్శం మని చెప్పారు.. ఇంకా మరికొంత మంది రైతు లకు మీ కల్ల ముందు జరిగిన ప్రత్యక్ష లాభాన్ని ఇతర రైతు లకు అవగాహన కలిపించాలని సూచించారు.. అశ్వరావు పేటకు అయిల్ ఫామ్ లో అంతర పంట సాగు తో ఎలాంటి ప్రయోజనం ఉందని మీరు చూసి వచ్చారు.. అయిల్ ఫామ్ లో కోకో సాగుకు ఎకరానికి 12వేల రాయితి ఉందన్నారు.
అదనంగా 80 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.. కోకో పంట వేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు..అంతర్ పంట సాగు ని వేసుకువాలని సూచించారు.. ఇది అయిల్ ఫామ్ సాగు కు మరో ముందడుగని, అయిల్ ఫామ్ సాగుని మరింత ప్రోత్సహించాలని మిరే అయిల్ ఫామ్ బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు..రైతు లకు మేలు చేసే దిశగా అయిల్ ఫామ్ సాగు విస్తరణ పెంచే అడుగులు వేయాలని సూచించారు.. రైతు లకు మేలు జరిగే ఈ పంట కు రైతు లకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారం ఉంటుందని చెప్పారు…