భారీ వర్షాల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి ఈమేరకు అప్రమత్తం చేశారు.వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధినేత కేసీఆర్ సూచించారు.



