యూపీ సీఎం కు దిశా పఠానీ తండ్రి జగదీశ్ థ్యాంక్స్

పల్లవి, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి దిశా పఠానీ తండ్రి జగదీశ్ సింగ్ పఠానీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు .. థ్యాంక్స్ తెలిపారు. బరేలీలో ఉన్న దిశా పఠానీ పూర్వీకుల ఇంటిపై కొన్ని రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ఇద్దర్నీ బుధవారం ఘాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్ స్పందిస్తూ.. నా తరపున, మా కుటుంబం తరపున సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు థ్యాంక్స్ చెబుతున్నానని, తనకు వాగ్దానం చేశారని, క్రిమినల్స్‌ను పట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నారని, సీఎంతో టెలిఫోన్‌లో సంభాషించానని, ఆయన నేతృత్వంలో యూపీ సర్కారు, యూపీ పోలీసులు భయరహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
పఠానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు మతపరమైన వ్యక్తుల గురించి దిశా,ఆమె సోదరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే నిందితులు రవీంద్ర, అరుణ్‌లను ఎన్‌కౌంటర్‌లో షూట్ చేశారు.
https://x.com/ANI/status/1968514767519162776?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1968514767519162776%7Ctwgr%5Ec911f50ac04ef2357f4a58c21ff70c77e8f9d44e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fdisha-patanis-father-jagadish-patani-thanked-cm-yogi-for-encountering-two-men-who-fired-at-his-house-2146872