pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Breaking News »
  • Cm Revanth Reddys Aerial Survey In Flood Areas Today

నేడు వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే…!

నేడు వరద ప్రాంతాల్లో  సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే…!
  • Edited By: Pallavi,
  • Published on August 28, 2025 / 10:18 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో   ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డినేడు గురువారం   నాడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు వెల్లడించారు. . భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు నేడు రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలపై మరోసారి నేటి రాత్రి మరోసారి సహాయ, పునరావాస కార్యక్రమాలు, ఆస్తి, ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు.

విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద భాదిత జిల్లాలకు నియమించేంచిన స్పెషల్ అధికారులు కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, గత 24 గంటలలో అత్యంత భారీ వర్షాలు కురిసిన్నప్పటికీ, పాలనా యంత్రాంగం సకాలంలో చేపట్టిన చర్యలతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. రేపు కూడా వర్షాలు పడే అవకాశమున్నందున జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు అవసరమైతే SDRF ,NDRF బృందాలను పంపిస్తామని తెలిపారు.

పోచారం జలాశయానికి నీటి ఇన్-ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుండి బయట పడ్డట్టే అని నీటి పారుదల శాఖ అధికారులు తెలియచేసారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. SRSP నుండి మూడు లక్షల క్యూసెక్కుల జలాలను, నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి లక్షా 90 వేలక్యూసెక్కుల జలాలను వదులుతున్నందున, దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు సి.ఎస్ సూచించారు. కల్వర్టులు, పొంగుతున్న వాగులు, లోతట్టు ప్రాంతాల వద్ద తగు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి, ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలనుండి పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి తగు ఆహరం, మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలను అందించాలని అన్నారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను వెంటనే పునరుద్దరించాలన్నారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #news
  • anumula revanth reddy
  • big news
  • breaking news
  • congress governament

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Latest
  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy